ప్రభాస్ అన్‌స్టాపబుల్ రెండో ఎపిసోడ్ ఎలా ఉందంటే..

ప్రభాస్ అన్‌స్టాపబుల్ రెండో ఎపిసోడ్ ఎలా ఉందంటే..

బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. సినీ , రాజకీయ ప్రముఖులను కవర్ చేస్తూ అలరిస్తున్నారు. ఈ మధ్యనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సందడి చేసిన సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ అంటూ ఆహా టీం చాల హడావిడి చేసి అంచనాలు పెంచింది. మొదటి ఎపిసోడ్ న్యూ ఇయర్ సందర్భాంగా డిసెంబర్ 30 న స్ట్రీమింగ్ చేయగా..రెండో ఎపిసోడ్ ఈరోజు అందుబాటులోకి వచ్చింది.

మొదటి ఎపిసోడ్ సరదా..సరదా గా సాగగా..రెండో ఎపిసోడ్ కాస్త ఎమోషన్ గా సాగింది. ప్రధానంగా ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రస్తావన వచ్చినప్పుడు ప్రభాస్ కూడా స్టేజీ మీద ఎమోషనల్ అయిపోయాడు. ప్రభాస్‌తో పాటు బాలకృష్ణ కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. కృష్ణం రాజ్ తో ఉన్న అనుబంధాన్ని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. గోపిచంద్ స్టేజీ మీదకు ఎంటర్ అవ్వడంతో రెండో ఎపిసోడ్ మొదలైంది. గోపిచంద్‌ను ప్రభాస్ పెళ్లి గురించి బాలకృష్ణ అడగ్గా, వచ్చే సంవత్సరం ఉండవచ్చేమో అని గోపిచంద్ సమాధానం ఇవ్వడం.. ఆ తర్వాత ప్రభాస్, గోపిచంద్‌లతో బాలకృష్ణ ఒక గేమ్ ఆడడం సరదాగా సాగింది.

అలాగే గోపిచంద్ తండ్రి టి.కృష్ణ ప్రస్తావన కూడా వచ్చింది. దీంతో పాటు ఫెయిల్యూర్స్‌లో ఉన్నప్పుడు ప్రభాస్, గోపిచంద్ ఎలా ఆలోచించారనే దానిపై కూడా బాలకృష్ణ ప్రశ్నించారు. ఈరోజు తాము ఈ పరిస్థితిలో ఉన్నామంటే పెదనాన్న వల్లే అని ప్రభాస్ అన్నారు.. ఆయనకు తామంతా రుణపడి ఉన్నామని ఎమోషనల్ అయ్యారు. తమ కుటుంబం అంతా పెదనాన్న మిస్ అవుతోందని ప్రభాస్ తెలిపారు. కృష్ణంరాజు అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో నెల రోజులు ఉన్నారని ప్రభాస్ చెప్పుకొచ్చారు. అప్పుడు తానూ ఆసుపత్రిలో ఉన్నానని, ఎప్పటికప్పుడు డాక్టర్స్ తో సంప్రదింపులు జరిపానని ప్రభాస్ పేర్కొన్నారు.

కృష్ణంరాజు మరణించిన సమయంలో తాను టర్కీలో ఉన్నారని బాలకృష్ణ తెలిపారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘వీర సింహా రెడ్డి’ చిత్రీకరణలో ఉండటంతో ఇండియా కు రాలేకపోయానన్నారు. ఆ విషయాన్ని గుర్తు చేసిన బాలకృష్ణ ‘నాకు విషయం తెలియగానే కంట్రోల్ చేసుకోలేకపోయా. వెంటనే ఏడుపు వచ్చేసింది’ అని చెప్పారు. ఓవరాల్ గా మొదటి ఎపిసోడ్‌కు ఏ మాత్రం తగ్గని విధంగా ఆసక్తికరంగా ఈ రెండో ఎపిసోడ్ కూడా సాగింది.

ఇక త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబదించిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతి కానుకగా ఈ మెగా ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేస్తారని వినికిడి.

https://www.instagram.com/reel/CmwcxPqIFEq/?utm_source=ig_web_copy_link

follow us