నా జీవితంలో జరిగిన ఆ సంఘటన ఎప్పటికి మర్చిపోను: యాంకర్ ప్రదీప్

బుల్లి తెర యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ప్రదీప్, అటు సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? చిత్రం విడుదలకు సిద్దం గా ఉన్నది. ఆ చిత్రం ఎప్పుడో పూర్తి అయ్యినప్పటికి దేశవ్యాప్తంగా కరోనా విస్తరించడం, లాక్ డౌన్ కారణంగా మూవీ థియేటర్స్ మూసి వెయ్యడంతో విడుదల వాయిదా పడుతూ వస్తుంది. ప్రస్తుతం ప్రదీప్ ఢీ జోడీ కి యాంకర్ గా రాణిస్తున్నాడు.
బుల్లి తెర యాంకర్ లో టాప్ యాంకర్ ఎవరు అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చే పేరు సుమ. సెలబ్రేటి టాక్ షో తో ఓ ప్రోగ్రామ్ ను చేస్తుంది. ఆ షో కు గెస్ట్ గా ప్రదీప్ మాచిరాజు హాజర్ అయ్యాడు ఆ షో లో ప్రదీప్ తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు వ్యక్తిగత విషయాలు, సినీ ప్రముఖులతో తనకు ఏర్పడిన పరిచయాల గురుంచి చెప్పుకొచ్చాడు. నేను యాంకరింగ్ చెయ్యడం మొదలు పెట్టినసమయంలో చిరంజీవి గారిని కలవడానికి వెళ్లినప్పుడు నాకు ఓ వింతైన అనుభవం ఎదురైందన్నారు..అది ఏమిటి అంటే…
చిరంజీవి గారి లాంటి స్టార్ ను కలవడానికి వెళ్లినప్పుడు. పెద్ద ఎత్తున ఫాన్స్, జనం బాగా హడహుడి ఉన్నది అక్కడ. ఇక ఆ జనంలో నన్ను ఎక్కడ గుర్తుపడుతారు అనుకుంటుండగా, ఆయన దూరం నుంచే నన్ను చూసి దగ్గరకు పిలిచి నీ యాంకరింగ్ బాగుటుంది, నువ్వు మాట్లాడే తెలుగు పదాలు అర్థవంతంగా ఉంటాయి. నీ వాయిస్ నీకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అంటూ.. చిరంజీవి గారు ఆ రోజు నన్ను మెచ్చుకున్నారని అన్నారు. ఆ సంఘటన నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అని ఆ సెలబ్రేటి టాక్ షో సందర్భంగా ప్రదీప్ గుర్తుచేసుకున్నాడు.