యాంకర్ ప్రదీప్ సినిమాకు షాక్ అయ్యే రేంజ్ లో కలెక్షన్స్..!

  • Written By: Last Updated:
యాంకర్ ప్రదీప్ సినిమాకు షాక్ అయ్యే రేంజ్ లో కలెక్షన్స్..!

ప్రముఖ యాంకర్ ప్రదీప్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా “30 రోజుల్లో ప్రేమించడం ఎలా”. ఈ సినిమాకు మున్నా దర్శకత్వం వహించారు. సినిమాలో ప్రదీప్ సరసన హీరోయిన్ గా అమ్రిత అయ్యర్ నటించింది. ఇక జనవరి 29న ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలను రీచ్ కాలేకపోయింది. సినిమా కు హిట్ టాక్ రకపోయినప్పటికీ కలెక్షన్ ల పరంగా చూసుకుంటే షాకింగ్ రేంజ్ లో వచ్చాయి. హీరోగా పరిచయమైన మొదటి ఈ రేంజ్ లో కలెక్షన్లు రావడం విశేషం. ఈ సినిమాకు మొదటి రోజే రూ.4 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

దాంతో చిత్ర యూనిట్ ఫుల్ జోష్ మీద ఉంది. యాంకర్ గా ప్రదీప్ కు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ కారణంగానే ఈ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చినట్టు అర్థమవుతోంది. లాక్ డౌన్ వేళ ఈ సినిమా నుండి విడుదలైన “నీలి నీలి ఆకాశం” పాట సినిమాకు ఇంత హైప్ తీసుకువచ్చిందని చెప్పొచ్చు. ఈ పాట యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించింది. ఈ సినిమా కు అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ప్లస్ అయ్యింది. ఈ పాటతో పాటు సినిమాలోని ఇతర పాటలు కూడా బాగానే ఉన్నాయి.

follow us