గ్లామర్ డోస్ పెంచిన బాపు బొమ్మ

గ్లామర్ డోస్ పెంచిన బాపు బొమ్మ

బాపు బొమ్మ ప్రణీత గ్లామర్ డోస్ పెంచింది. పెళ్ళై..తల్లైన తర్వాత కూడా అమ్మడి అందం రవ్వంత కూడా తగ్గకపోగా..మరింత పెరుగుతుంది. ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసిన ఈమె..ఆ తర్వాత బావ (2010) సినిమా తనకు మంచి పేరును తీసుకొచ్చింది. పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది సినిమాలో నటించి మరింత పాపులర్ అయ్యింది.ఈ సినిమా తర్వాత వరుస ఛాన్సులు వచ్చినప్పటికీ అవన్నీ ప్లాప్ అయ్యేసరికి..మళ్లీ కొత్త ఛాన్సులు రాకపోయేసరికి గత ఏడాది పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది.

ప్రస్తుతం పెళ్లై ఒక పాప ఉన్నా సరే మళ్లీ సినిమాల్లో రాణించాలని ప్రణీత ట్రై చేస్తుంది.అందుకే తగ్గట్లే తన గ్లామర్ ను మరింత పెంచింది. దీనికి నిదర్శనం తాజాగా షేర్ చేసిన ఫోటోనే. వైట్ టాప్ తో అందాలన్ని కనిపించేలా.. డెనిమ్ జీన్స్.. కళ్లకి గాగుల్స్ పెట్టుకొని అబ్బా అనిపించింది. అసలు తనకు పెళ్లైంది.. ఒక పాప కూడా ఉంది అన్న ఆలోచన కూడా ఎక్కడ లేని విధంగా ప్రణీత తన గ్లామర్ తో అదరగొట్టింది.

follow us

Related News