ప్రభాస్ “సలార్” అంటే ఏమిటో తెలుసా ?

ప్రభాస్ “సలార్” అంటే ఏమిటో తెలుసా ?

రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం “సలార్”. హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రెండు రోజుల క్రింద విడుదల చేసిన సంగతి తెలిసిందే. “సలార్” అంటూ.. ప్రభాస్ వస్తుండటంతో జనాల్లో ఓ విదమైన ఆశక్తి రేకెత్తింది. అదే సలార్ అంటే ఏమిటి అని. ప్రేక్షకులు, అభిమానులు “వాట్ ఇస్ సలార్” అంటూ గూగుల్ లో సర్చ్ చెయ్యడం కూడా స్టార్ట్ చేశారు. కానీ ఎవరికి సరైన సమదానం మాత్రం దొరకలేదు. ఇంత సస్పెన్స్ తో కూడిన పేరును ప్రభాస్ కే ఎందుకు రిజిస్టర్ చేశాడు అనే సందేహం కూడా మొదలైంది.

దానికి వివరణగా ప్రశాంత్ నీల్… “సలార్” అనే పదం ఉర్దు బాషకు సంబందించినది.. “సలార్” అంటే లీడర్ ఏదైనా పనిని సమర్థవంతంగా ముందుండి నడిపించేవాడు. ప్రభాస్ నే ఎందుకు ఈ సినిమాకు ఎంపిక చేశాను అంటే అమాయకంగా ఉండే వ్యక్తి కరుడుగట్టిన లీడర్ గా మారితే ఏవిదంగా ఉంటుందనేది నా సినిమా. అమాయకత్వాని, రౌద్రాన్ని పండించడంలో ప్రభాస్ కు ఎవరు సాటిలేరు. అది ఆయన నటించిన సినిమాలు చూస్తే అర్థం అవ్వుతుంది అందుకే నా ఈ “సలార్” కు ప్రభాస్ కరెక్ట్ గా సరిపోతాడు. అని అన్నారు. ప్రభాస్ సినిమా విషయానికి వస్తే “జిల్” ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో “రాధే శ్యామ్” అనే చిత్రంలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే ప్రభాస్ కి జోడీగా నటిస్తుంది.

follow us