ఆర్ఆర్ఆర్ నుండి బిగ్ అప్డేట్…సీత లుక్ వచ్చేసింది..!

  • Written By: Last Updated:
ఆర్ఆర్ఆర్ నుండి బిగ్ అప్డేట్…సీత లుక్ వచ్చేసింది..!

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్ మరియుంరం చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. సినిమాలో ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా…రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇక సినిమాలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ హీరోయిన్ నటిస్తుండగా..రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. కాగా సినిమా నుండి ఇప్పటికే ఎన్టీఆర్ చరణ్ ల ఫొటోలతో పాటు వీడియోలను విడుదల చేసిన చిత్ర యూనిట్ హీరోయిన్ ల పోస్టర్లను వీడియోలను మాత్రం విడుదల చేయలేదు.

తాజాగా సినిమా నుండి అలియా భట్ పోస్టర్ ను ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ విడుదల చేసింది. సినిమాలో అలియా భట్ పేరును సీతగా ప్రకటించింది. ఇక అలియా సీత లుక్ లో లంగా వోణి ధరించిన అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపిస్తోంది. నిన్న విడుదల చేసిన అలియా ప్రీ లుక్ కూడా కూడా మంచి రెస్పాన్స్ రాగా…తాజాగా ఈరోజు అలియా బర్త్ డే సందర్భంగా సీత లుక్ ను రిలీజ్ చేసింది. ఇక ఈ ఫోటోను అటు ఎన్టీఆర్ అభిమానులు ఇటు చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా చిత్రాన్ని అక్టోబర్ 3 న విడుదల చేయనున్నారు.

follow us