పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కడువా’ మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల

మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ , మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ కాంబినేషన్ తెరకెక్కిన హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్ కడువా.

చిత్ర నిర్మాతలు సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వస్తున్న ‘ కడువా’ జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు.

ప్రభుదేవా మై డియర్ భూతం మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్.. ఆసక్తి రేకెత్తిస్తున్న పోస్టర్

ఈ భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్‌ మరో ప్రధాన పాత్రలో నటించారు. ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయిక.

మ్యాజిక్ ఫ్రేమ్స్ & పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.

తారాగణం: పృథ్వీరాజ్ సుకుమారన్, సంయుక్త మీనన్, వివేక్ ఒబెరాయ్, అర్జున్ అశోక్, సిద్ధిక్, అజు వర్గీస్, దిలీష్ పోతన్ తదితరులు.