నారప్పలో సుందరమ్మ గా ప్రియమణి…

నారప్పలో సుందరమ్మ గా ప్రియమణి…

సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరీ ఇంటిపేరు గా చేసుకున్న వెంకటేష్ హీరోగా, మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న చిత్రం నారప్ప. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి మొదటిసారి విక్టరీ వెంకటేష్ తో కలిసి నటిస్తున్నారు. నారప్ప చిత్రం లో ప్రియమణి సుందరమ్మ గా చాలా రోజులు మన తెలుగు వారికి గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఈ రోజు సుందరమ్మ ప్రియమణి పుట్టినరోజు సందర్భంగా ఇలా మరెన్నో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ నారప్ప టీం శుభాకాంక్షలు తెలియజేస్తూ సుందరమ్మ పాత్ర లుక్ ని విడుదల చేశారు.

Tags

follow us