భాగ్యనగరం లో రాత్రి 9:30 కి ఇలా జరగడం ఏంటి
భాగ్య నగరం లో రోజుకి ఒక దారుణం .. ఒక రోజు ఆర్టీసీ బస్సు కింద పడి ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మృతి చెందితే.. ఇప్పుడు ఒక డాక్టర్ ని అది టోల్ గేట్ కి సమీపం లో 9:30 కి సజీవ దహనం చేశారు.
ప్రియాంక రెడ్డి ఒక వెటనరీ డాక్టర్ ఆమె విధులు ముగించుకొని వస్తుండగా ఈ దారుణం జరిగింది..సాయంత్రం 5:30 కి ఇంట్లో నుంచి బయలు దేరింది.. వెళ్లే అప్పుడే తన స్కూటీ పంచర్ అయ్యింది. టోల్ గేట్ దగ్గర పెట్టి తాను క్యాబ్ లో వెళ్లి తన పని చూసుకొని వచ్చింది.. వచ్చే సరికి 9:30.. తన చెల్లికి ఫోన్ చేసింది అక్కడ చుట్టూ లారీ డ్రైవర్స్ ఉన్నారని.. ఫోన్ పెట్టేసాక ఆమెని డ్రైవర్స్ నమ్మించి కొంచెం దూరం కి ముందుకు తీసుకువెళ్లి పంచర్ వేయిస్తాం అని అక్కడ నుంచి ఆమెని ఎవరు లేని ప్రదేశానికి తీసుకు వెళ్లి అక్కడ మానభంగం చేసి సజీవ దహనం చేశారు .. ఉదయం 4:30 కి ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు..
టోల్ గేట్ దగ్గరలోనే పోలీసులకి ఆమె వస్తువులు కొన్ని లభ్యం అయినవి .. కానీ ఆమె స్కూటీ మాత్రం ఇంకా లభ్యం కాలేదు.
రాత్రి 9:30 కి భాగ్యనగరం లో అది టోల్ గేట్ కి సమీపం లో ఇలా జరగడం దారుణం చాలా బాధ కరం.. ఇంత వరకు ప్రభుత్వ నిర్వాహకులు స్పందించక పోవడం ఇంకా శోచనీయం..