ఈసారి ప‌వ‌న్ రావ‌డంలో లేట్ లేద‌ట‌…సంక్రాంతికి ప‌క్కా..!

  • Written By: Last Updated:
ఈసారి ప‌వ‌న్ రావ‌డంలో లేట్ లేద‌ట‌…సంక్రాంతికి ప‌క్కా..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌ర్శ‌కుడు క్రిష్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న సినిమా హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు. ఎ ఎం ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా పిరియాడిక‌ల్ స్టోరీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. అంతే కాకుండా ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించ‌డం కూడా ఇదే మొద‌టిసారి. సినిమాలో ప‌వ‌న్ వ‌జ్రాల దొంగ‌గా క‌నిపించ‌బోతున్నార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా నుండి విడ‌దుల చేసిన పోస్ట‌ర్లు ఫస్ట్ గ్లింప్స్ కూడా ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అక‌ట్టుకున్నాయి. అంతే కాకుడా ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుద‌ల చేస్తామ‌ని గ‌తంలో చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. అయితే ఇప్ప‌డు క‌రోనా కార‌ణంగా చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వ‌ర‌కూ అన్ని షూటింగ్ లు వాయిదా ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలోనే హ‌రిహ‌ర‌వీర‌ల్లు షూటింగ్ కు కూడా బ్రేక్ ప‌డింది. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌రోనా బారిన ప‌డి ప్ర‌స్తుతం కోలుకున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌కు కొన్ని ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌టం వ‌ల్ల జూన్ వ‌ర‌కు షూటింగ్ లో పాల్గొన‌కూడ‌ద‌ని నిర్ణయించుకున్నారు.

ఈ నేప‌థ్యంలో హరిహ‌ర‌వీర‌వ‌మ‌ల్లు షూటింగ్ ఇప్ప‌ట్లో పూర్తి కాద‌ని కాబ‌ట్టి సినిమా సంక్రాంతికి విడుద‌ల‌య్యే అవ‌కాశం లేద‌ని వార్తలు వ‌స్తున్నాయి. దీనిపై నిర్మాత ఎఎం ర‌త్నం తాజాగా స్పందించారు. హరిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేస్తాం. సంక్రాంతికి ఇంకా చాలా స‌మ‌యం ఉంది. క్రిష్ అనుకున్న స‌మ‌యం కంటే మందుగానే షూటింగ్ ను పూర్తిచేసే ద‌ర్శ‌కుడు. సంక్రాంతికి ఈ సినిమా థియేట‌ర్ లో ఉంటుంది. అని బ‌ల్ల‌గుద్దిన‌ట్టు చెప్పారు.

follow us