రెండు పార్టులుగా పుష్ప‌..ప్రూఫ్ ఇదే.. !

  • Written By: Last Updated:
రెండు పార్టులుగా పుష్ప‌..ప్రూఫ్ ఇదే.. !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న సినిమా పుష్ప‌. ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో నటిస్తున్నారు. అంతే కాకుండా గంద‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ సినిమా తెరెకెక్కుతోంది. అయితే కొంత కాలంగా ఈ సినిమాను రెండు భాగాలుగా విడుద‌ల చేస్తార‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్న సంగ‌తి తెలిసిందే.

అంతే కాకుండా ఈ సినిమాకు అనుకున్న బ‌డ్జెట్ కంటే 50 శాతం ఎక్కువ అవుతుంద‌ని కాబ‌ట్టి వ‌ర్కౌట్ అవ్వాలంటే రెండు పార్టులుగా విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నట్టు గుస‌గుస‌లు వినిపించారు. కాగా తాజాగా ఆ విష‌య‌మై సినిమా నిర్మాత‌ల్లో ఒక‌రైన ర‌విశంక‌ర్ క్లారిటీ ఇచ్చారు. పుష్ప సినిమాను రెండు గంట‌న్న‌ర లో చెప్ప‌లేమ‌ని అన్నారు.అందువ‌ల్లే సినిమాను రెండు భాగాలుగా విడుద‌ల చేయాల‌ని అల్లు అర్జున్ సుకుమార్ తో క‌లిసి తాము నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు. అంతే కాకుండా ఇప్ప‌టికే సెకండ్ పార్ట్ కూడా 10 శాతం షూట్ పూర్త‌యింద‌ని అన్నారు.

follow us