ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తారని అధికారికంగా నిర్మాత నాగ వంశీ ప్రకటించారు. అంతే కాకుండా ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్న వెంటనే ఈ సినిమా మొదలవుతుందని కూడా టాక్ వినిపించింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా కు బ్రేక్ పడిందని పలు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కు ఓ కథ చెప్పారని కానీ అది ఎన్టీఆర్ కు నచ్చని కారణంగా నో చెప్పాడని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఓ యాక్షన్ స్టోరీ ని కూడా ఎన్టీఆర్ కు త్రివిక్రమ్ చెప్పాడని అయితే ఎన్టీఆర్ మాత్రం ఫ్యామిలీ కథతో రావాలని చెప్పినట్టు గుసగుసలు వినిపించాయి.
అయితే ఇవేవీ కుదరని కారణంగా ఏకంగా ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ ల ప్రాజక్టు క్యాన్సిల్ అయ్యిందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్తల పై సినిమా నిర్మాత నాగవంశీ స్పందించారు. ఓ ఎన్టీఆర్ అభిమాని నాగ వంశీని టాగ్ చేస్తూ సినిమా క్యాన్సిల్ అయ్యిందా అని ప్రశ్నించగా నాగ వంశీ అదో పెద్ద జోక్ గాయ్స్ అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక నాగ వంశీ సమాధానంతో ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా పక్కా ఉంటుందని తేలిపోయింది.