పృధ్వీరాజ్ రాజీనామా, భ్రష్టు పట్టి పోతారు …!

పృధ్వీరాజ్ రాజీనామా, భ్రష్టు పట్టి పోతారు …!

ఎస్‌వీబీసీ ఛైర్మన్ పదవికి సినీనటుడు పృధ్వీరాజ్ రాజీనామా చేశారు. వైసీపీ హైకమాండ్ ఆడియో టేపుల వ్యవహారంపై సీరియస్ అవడంతో , టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి జగన్ దృష్టికి తీసుకెళ్ళారు. అయితే ఆయన ఎస్వీబీసీ చైర్మన్ పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో పృథ్వి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన రాజీనామా ప్రకటించారు.

టీటీడీలో ఉన్నప్పుడు నేను రాజకీయాలు మాట్లాడను అని చెప్పడంతోనే తనను టార్గెట్ చేశారని పేర్కొన్నారు.  అలాగే రైతులు గురించి ,రైతు కష్టం నాకు తెలుసని అన్నారు.  నాలుగు నెలల్లో ఏ ఒక్క ఉద్యోగిని ఇబ్బంది పెట్టలేదని, నా తొమ్మిది నెలల బ్లడ్ సాంపిల్ తీసి చూడండి, జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని దీక్ష చేశా. మందు అలవాటు లేదు, స్వామి మీద ఒట్టు వేసి చెబుతున్నా…నా మీద ఆరోపణలు చేసిన వారు భ్రష్టు పట్టి పోతార ని ఆయన అన్నారు. 

Tags

follow us

Web Stories