రాఖీబాయ్ తో పూరీ..ఆ బ్యాక్ డ్రాప్ లో సినిమా..?

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది. అటు దర్శకులు ఇటు హీరోలు పాన్ ఇండియా సినిమాలో ఫుల్ బిజీ అవుతున్నారు. అలా పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్ తో వచ్చి ఓవర్ నైట్ స్టార్ గా మారిన హీరో కన్నడ స్టార్ యశ్. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో యశ్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ఇప్పటికే కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ 2 కూడా షూటింగ్ పూర్తయ్యింది. ఇదిలా ఉండగా ఇప్పుడు యశ్ హీరోగా పూరీ జగన్నాథ్ ఓ సినిమా తీయబోతున్నారట.
ఇప్పటికే పూరీ యశ్ కు కథను వినిపించగా మాస్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అంతే కాకుండా ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పొలిటికల్ థ్రిల్లర్ గా పూరీ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నానడట. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం పూరీజగన్నాత్ విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.