సంక్రాంతి తర్వాతే ఫైటర్ !

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ టాలీవుడ్ నెంబర్ వన్ దర్శకుల్లో ఒక్కరు. వరస హిట్స్ తో దూసుకెళ్లుతున్న పూరీకి.. గత కొంతకాలంగా ప్లాఫ్స్ రావడంతో కెరీర్ లో బ్యాక్ స్టెప్ తీసుకున్నాడు. ఈ మధ్య కాలంలో రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ ఘన విజయం సాదించడంతో మరల సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ తో ఫైటర్ అనే చిత్రంను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.
కరోనా ఇండియాలోకి రాక ముందు వరకు.. ఈ చిత్రం షూటింగ్ ముంబయి లో జరుపుకుంది. తెలుగుతో పాటుగా హిందిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కరోనా వైరస్, లాక్ డౌన్ వలన అన్నీ సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. ఈ మధ్యనే సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఒక్కొక్కటిగా పర్మిషన్స్ ఇవ్వడంతో తిరిగి షూటింగ్స్ మొదలయ్యాయి. భారీ బడ్జెట్ చిత్రాలే కరోనా నిబందనలు పాటిస్తూ షూటింగ్స్ జరుపుకుంటుంటే, పూరీ జగన్నాథ్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. విజయ్ దేవరకొండ మాత్రం మరో రెండు సినిమాలు కమిట్ అయ్యాడు. సినీ వర్గాల సమాచారం మేరకు ఫైటర్ మూవీ షూటింగ్ ను వచ్చే ఏడాది సంక్రాంతి పండగ తర్వాతనే మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రానికి ఓ నిర్మాత గా కరణ్ జోహర్ మరో నిర్మాతగా ఛార్మి ఉన్నారు. బాలీవుడ్ లోకి విజయ్ దేవరకొండ ఫైటర్ తో అడుగు పెట్టబోతున్నాడు.