‘తిమ్మరుసు’టీజర్ కు పూరీ ఫిదా !!

సత్య దేవ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలోకి వచ్చి విలన్ గా పలు సినిమాల్లో మెప్పించి హీరోగా రానిస్తూ అందరిచే శభాస్ అనిపించుకుంటున్న నటుడు. ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ లో స్నేహితుడు పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన సత్య దేవ్ సోలో హీరోగా మారిపోయాడు. ఇక లాక్ డౌన్ సమయంలో ఓటీటీ లో సినిమాలు విడుదల చేస్తూ బిజీగా ఉన్న నటుడు.
ప్రస్తుతం ఆయన శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ‘తిమ్మరుసు’అనే చిత్రంలో నటిస్తున్నాడు. సత్య దేవ్ కి జోడీగా ప్రియాంకా జావల్కర్ నటిస్తుంది. ఈ చిత్ర నుండి కొద్ది నిమిషాల కిందట టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ పై ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆసక్తికర కామెంట్ చేశాడు. చూడటానికి టీజర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది అల్ తే బెస్ట్ సత్య దేవ్ అండ్ ‘తిమ్మరుసు’టీమ్ అంటూ ట్విటర్ ద్వారా తెలియజేశాడు.
ఇక టీజర్ లో సత్య దేవ్ లాయర్ గా కనిపిస్తున్నాడు. నీతి,న్యాయం అనే తరహా పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. “కేస్ గెలిచామ ఓడమా అనేది కాదు ఇంపార్టెంట్ సంపాదన ఎంత అనేదే ఇంపార్టెంట్” సత్య దేవ్ మాట్లాడుతూ నాకు మాత్రం న్యాయం గెలవడమే ఇంపార్టెంట్ సర్ అంటూ టీజర్ కొనసాగింది. వచ్చే నెలల్లో చిత్రాన్ని విడుదల చెయ్యడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు