“పుష్ప” షూటింగ్ మాత్రం ఆగదు అంటున్న సుకుమార్ !

  • Written By: Last Updated:
“పుష్ప” షూటింగ్ మాత్రం ఆగదు అంటున్న సుకుమార్ !

“అల వైకుంటపురంలో” సినిమా తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం “పుష్ప”. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందన్నా బన్నీ కి జోడీగా నటిస్తుంది. ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ని ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా మారేడ్ మిల్లీ అడవిలో చిత్రీకరించారు. గందపుచెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం యొక్క కథ ఉంటుంది. కావున రియాలిస్టిక్ గా సినిమా రావడానికి అడవి ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నారు. గత వారం పుష్ప టీమ్ లో కొంత మంది సభ్యులకు కరోనా రావడంతో ప్యాకప్ చెప్పి హైదరాబాద్ కు వచ్చేసింది. ఎక్కువ మంది సభ్యులతో షూటింగ్ చెయ్యడం వలన ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

తాజాగా పుష్ప టీమ్ నుండి వస్తున్న వార్తల ప్రకారం తెర వెనుక షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఓ 5 రోజులు అడవి నేపథ్యంలో సాగే షూటింగ్ ఉండటంతో హైదరాబాద్ నగర్ శివారు ప్రాంతాల్లో పుష్ప టీమ్ షూటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ నెల 13 నుండి అక్కడ షూటింగ్ జరుపుకుంటుందని తెలుస్తుంది. ఈసారి కరోనా నిబందనలు పాటిస్తూ అతి తక్కువ మంది సభ్యులతో షూటింగ్ చెయ్యనున్నారు. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ పుష్పారాజ్ అనే లారీ డ్రైవరు పాత్రలో నటిస్తున్నాడు. మొత్తం 9 మంది విలన్ లు ఈ చిత్రంలో ఉండనున్నారని సమాచారం. మెయిన్ విలన్ ను ఎవరు అనేది సుకుమార్ ఇంతవరకు ప్రకటించలేదు. ఏది ఏమైనా పుష్ప షూటింగ్ మాత్రం ఆగదు అన్నట్లుగా సుకుమార్ ఉన్నాడు.

follow us