కరోనా పేషంట్స్ కోసం రాధే శ్యామ్ సెట్ ..!

  • Written By: Last Updated:
కరోనా పేషంట్స్ కోసం రాధే శ్యామ్ సెట్ ..!

ప్రస్తుతం కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోందిమ్ రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుతోంది. దాంతో దేశంలో బెడ్స్, మందులు, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడింది. సరైన సమయానికి ఆస్పత్రిలో బెడ్ దొరక్క ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కరోనా బాధితులకు రాధే శ్యామ్ చిత్ర బృందం తమవంతు సహాయం చేసింది. రాధే శ్యామ్ షూటింగ్ లో ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినిమా కోసం వేసిన ఆస్పత్రి సెట్ లోని అవసరమైన వస్తువులను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి దానం చేశారు. వాటిలో 50 బెడ్లు, స్ట్రెచ్ఛర్లు మరియు ఆక్సిజన్ సిలిండర్ లు ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు 9 ట్రక్కుల్లో వస్తువులను ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా రాధే శ్యామ్ లో ఆస్పత్రికి సంబందించిన సెట్ లో కీలక సన్నివేశాలు చిత్రించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే వైద్య విద్యార్థి పాత్రలో నటిస్తోందని…అంతే కాకుండా ప్రభాస్ తో ఆమె ప్రేమలో పడేది కూడా ఆస్పత్రిలోనేనని గుసగుసలు వినిపించాయి. ఇక ఇప్పుడు చిత్ర బృందం ఆస్పత్రి సెట్ ను దానం చేయడంతో ఆ వార్తలు నిజమేనని అనిపిస్తోంది. ఇక ఈ సినిమాకు జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాకుండా ఈ చిత్రాన్ని పిరియాడికల్ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.

follow us