రానాకు డ్రైవ‌ర్ గా బ్ర‌హ్మాజీ..!

  • Written By: Last Updated:
రానాకు డ్రైవ‌ర్ గా బ్ర‌హ్మాజీ..!

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో న‌టిస్తున్నారు. వాటిలో ఒక‌టి హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమా కాగా మ‌రొక‌టి అయ్య‌ప్ప‌నుమ్ కోషియం రీమేక్. ఈ చిత్రానికి సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకు త‌మన్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. ఇప్ప‌టికే త‌మ‌న్ ప‌వ‌న్ హీరోగా న‌టించిన వ‌కీల్ సాబ్ సినిమాకు మ్యూజిక్ అందించి ప్ర‌శంస‌లు అందుకున్నారు. కాగా ఇప్పుడు మ‌రోసారి ప‌వ‌న్ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ కొట్టేశారు. ఈ రీమేక్ సినిమాను సితార ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

అంతే కాంకుడా ఈ సినిమాలో రానాకు జోడీగా ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్ గా న‌టిస్తున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాన్ కు హీరోయిన్ గా సాయి ప‌ల్ల‌విని అనుకోగా రౌడీ బేబీ రిజెక్ట్ చేసినట్టుగా ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ సమాచారం భ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో రానాకు డ్రైవ‌ర్ గా న‌టుడు బ్ర‌హ్మాజీ నటిచ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో రానా పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇదిలా ఉండ‌గా మ‌ల‌యాళంలో అయ్య‌ప్ప‌నుమ్ కోషియం సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. దాంతో తెలుగు రీమేక్ పైనా ఎన్నో అంచ‌నాలున్నాయి.

follow us