ఆర్ఆర్ఆర్ కోసం బాలీవుడ్ హీరోతో సంప్రదింపులు..

  • Written By: Last Updated:
ఆర్ఆర్ఆర్ కోసం బాలీవుడ్ హీరోతో సంప్రదింపులు..

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ఆర్ఆర్” అనే మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్‌టి‌ఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్నారు. పిరియాడికల్ నేపథ్యం కలిగిన కథకు సోషియో ఫాంటసీ కలిపిన చిత్రంగా వస్తుంది. ఈ చిత్రంలో ఎన్‌టి‌ఆర్ కొమరం భీమ్ గా చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. వారి పాత్రలకు సంబందించిన ప్రోమో లను ఇటీవల విడుదల చేసి సినిమాపై మంచి హైప్ తీసుకువచ్చి పాన్ ఇండియా మూవీ కి మార్కెటింగ్ అంటే ఇలా చెయ్యాలి అనే విదంగా జక్కన ప్లాన్ చేశాడు.

ఏదైనా సినిమాను ప్రమోట్ చెయ్యాలంటే రాజమౌళి తరువాతే ఎవరైన అని చెప్పాలి. అందుకు ఉదాహరణగా బాహుబలి సినిమా కు వచ్చిన కలెక్షన్స్ చెప్పవచ్చు. తాజా సమాచారం మేరకు బాలీవుడ్ లో ఎన్‌టి‌ఆర్, చరణ్ పాత్రలను స్టార్ హీరో వాయిస్ తో ఇంట్రడ్యూస్ చేస్తే సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని భావించి అమీర్ ఖాన్ ను లైన్ లో పెట్టడని సమాచారం. రాజమౌళి అమీర్ కు పెద్ద ఫ్యాన్, ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని బాలీవుడ్ లో అమీర్ ఖాన్ వాయిస్ ఓవర్ తో ఇంట్రడ్యూస్ చెయ్యాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, సింగం హీరో అజయ్ దేవగన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. కీరవాణి సంగీత స్వరాలు అందిస్తున్నాడు.

follow us