హీరో రాజశేఖర్ కి యాక్సిడెంట్…గాయాలు !

  • Written By: Last Updated:
హీరో రాజశేఖర్ కి యాక్సిడెంట్…గాయాలు !

టాలీవుడ్ లో హీరోగా పలు హిట్ సినిమాల్లో నటించిన రాజశేఖర్ కి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ ఓఆర్ఆర్ మీద బోల్తా పడింది. పెద్ద గోల్కొండ వద్ద అదుపుతప్పి బోల్తా ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. అయితే ఆ కార్ హై ఎండ్ కార్ కావడంతో అందులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకుని ఆయన ఆయనతో పాటు ప్రయాణిస్తున్న మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయట పడ్డారు.

అయితే యాక్సిడెంట్ లు ఆయనకేమీ కొత్త కాదు. గతంలో కూడా తల్లి చనిపోయిన బాధలో ఉండి నిద్రమాత్రలు మింగడంతో మత్తుకు గురై ఓఆర్ఆర్ మీద ప్రయాణిస్తున్న మరో కార్ ని గుద్దేశారు. అప్పట్లో ఆ ఘటన సంచలనం అయింది. అందరూ ఆయన మద్యం సేవించి కారు నడిపాడేమోననే అనుకున్నారు. అయితే తల్లి మరణం తర్వాత చాలా డిప్రెషన్‌ గురవుతున్నానని, అందుకే నిద్రకు మాత్రలు తీసుకున్నానని, అందుకే ఈ ఘటన జరిగిందని రాజశేఖర్‌ వివరణ ఇచ్చారు. ఆ తర్వాత ఇక ఆయన పెద్దకుమార్తె, త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలని విక్రమార్క ప్రయత్నాలు చేస్తున్న శివాని కూడా ఆ మధ్య జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి సమయంలో ఆగివున్న కారుని ఢీకొట్టారు. కారు అతి వేగంగా ఉండడం వల్లే ఆ యాక్సిడెంట్ అయింది. అయితే ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ గురించి మాత్రం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

follow us

Web Stories