హెల్త్‌ బులెటిన్‌: రేపు రజనీకాంత్ డిశ్చార్జ్ !

  • Written By: Last Updated:
హెల్త్‌ బులెటిన్‌: రేపు రజనీకాంత్ డిశ్చార్జ్ !

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై అపోలో హాస్పిటల్స్ తాజాగా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బులెటిన్‌లో వైద్యులు పేర్కొన్నారు. రజినీకాంత్‌ను ఈ రాత్రికి హాస్పిటల్‌లోనే ఉంటారని, రేపు ఇతర పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు వెల్లడించారు. కాగా రేపు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలిపారు. కాగా రజినీకాంత్‌ను చూసేందుకు ఎవ్వరూ హాస్పిటల్‌కు రావద్దని రిక్వెస్ట్ చేశారు.

రజినీకాంత్ ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. ఆయన రక్తపోటును నియంత్రించేందుకు మందులు ఇస్తున్నాం. ఈరోజు రాత్రి కూడా ఆయన హాస్పిటల్‌లోనే ఉంటారు. రేపు ఇతర పరీక్షలు నిర్వహిస్తాం. శ్రేయోభిలాషులు ఎవరూ హాస్పిటల్‌ను సందర్శించవద్దని ఆయన కుటుంబసభ్యులు, వైద్యులు విజ్ఞప్తి చేశారు. ఆయనతో ప్రస్తుతం ఆయన కుమార్తె ఉన్నారు.

ఇదిలా ఉంటే, రజినీకాంత్ త్వరగా కోలువాలని సినీ ప్రముఖులతో రాజకీయ ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు. రజినీకాంత్ అస్వస్థతపై ట్విట్టర్‌ ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రజినీకాంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని చెప్పారు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ కూడా ఒక ప్రకటనను విడుదల చేశారు.

follow us