డిసెంబర్ 31న పార్టీ ప్రకటన : రజినీ

డిసెంబర్ 31న పార్టీ ప్రకటన : రజినీ

తమిళనాడు రాజకీయలోకి సూపర్ స్టార్ రజినీకాంత్ రంగ ప్రవేశం చెయ్యబోతున్నాడని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. కానీ రజినీకాంత్ మాత్రం చాలాకాలం వరకు సైలెంట్ గానే ఉన్నారు. ఈ విషయం పై సూపర్ స్టార్ తన పంతాను మార్చుకున్నాడు. అభిమానుల కోరిక మేరకు రాజకీయాల్లో వస్తున్నారు అందుకు సంబందించిన అధికారిక ప్రకటన ట్విటర్ ద్వారా ఇచ్చేశాడు. అంతకు ముందు రజినీకాంత్ పలు రాజకీయా పార్టీ లో చేరికపై పై రక రకాల వార్తలు వచ్చాయి ఆయన జాతీయ పార్టీ లో చేరబోతున్నాడని. బి‌జే‌పి తో కలుస్తాడని… ప్రాంతీయ పార్టీ డి‌ఎం‌కే తో చేతులు కలుపుతున్నాడని, ఇలా ఎన్నో రకాల పుకార్లు పుట్టాయి.

తాజాగా ట్విటర్ ద్వారా తను పెట్టబోయే పార్టీ పై సూపర్ స్టార్ క్లారిటి ఇవ్వడంతో అన్నీ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడినట్లు అయింది. 2021 అసెంబ్లి ఎలక్షన్స్ లో పోటీ చేస్తాం అని అభిమానులు అందరూ సిద్దం అవ్వాలని సూచించాడు. ఈ నెల 31న పార్టీ గుర్తు పై , పార్టీ పేరు పై పూర్తి వివరాలు తెలుస్తాయి అన్నారు. జనవరి నుండి పార్టీ ని ప్రజల్లోకి తీసుకెళ్లుతా అన్నారు. కమల్ హాసన్ పార్టీ తో కలిసి నడుస్తారు అనే వార్తలు వస్తున్నాయి. ఇక సినిమా విషయానికి వస్తే మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన “దర్బార్” చిత్రం తరువాత “అన్నాథ్” అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ అక్కడ పొంగల్ కి విడుదల కానున్నది.

follow us