రెండు నెలలు సహజీవనం తరువాత పెళ్లి చేసుకున్న కొరియెగ్రాఫర్

కొరియెగ్రాఫర్ కమ్ హీరో, ప్రభుదేవా పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతున్నాయి. నయనతార తో మొదట ప్రేమ వ్యవహారం నడిపిన ప్రభుదేవ పెళ్లి వరకు వచ్చి విడిపోయారు. ప్రస్తుతం నయన్ విగ్నెష్ శివన్ తో లివింగ్ రిలేషన్ లో ఉన్నది. మరి కొద్దీ రోజుల్లోనే ఈ జంట పెళ్లిచేసుకోబోతున్నారు. నయన్ తో విడిపోయిన ప్రభు మాత్రం ఒంటరిగానే ఉంటూ వస్తున్నాడు.

సోషల్ మీడియాలో ప్రభుదేవా పెళ్లి చేసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. ప్రభుదేవా తమ్ముడు రాజు సుందరం పెళ్లి వార్తలపై ఓ క్లారిటి ఇచ్చాడు. అన్నయ్య పెళ్లి పట్ల్ల మాకూటుంబం చాలా సంతోషం గా ఉన్నది. అన్నయ్య పెళ్లి విషయంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తల యొక్క పూర్తి సమాచారం అంతా మీకే తెలుసు అన్నారు. అలాగే అన్నయ్య పెళ్లి చేసుకున్నది ప్రముఖ డాక్టర్ హిమ అన్నారు. ప్రభు దేవ మొదటి వివాహం 1995 లో రామలత తో జరిగింది. కొంతకాలం తరువాత వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు.
ముంబయి కి చెందిని హిమ ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ ని సమాచారం. వీరిద్దరు రెండు నెలలుగా సహజీవనంలో ఉన్నట్లు గా, సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే పెళ్లి విషయం పై ప్రభుదేవా మాత్రం అధికారికంగా క్లారిటి మాత్రం ఇవ్వలేదు. ప్రభుదేవా మాత్రం బాలీవుడ్ లో నెంబర్ వన్ డాన్స్ మాస్టర్ గా రాణిస్తున్నాడు..