రకుల్ ప్రీతీ సింగ్ ఇంట విషాద ఛాయలు

రకుల్ ప్రీతీ సింగ్ ఇంట విషాద ఛాయలు

రకుల్ ఇంట విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఆమె పెట్ డాగ్ బ్లోసమ్ మృతిచెందింది. ఈ విషయాన్ని రకుల్ ఇంస్టాగ్రామ్ ద్వారా ఫాలోయర్స్ ను తెలియజేసింది. బ్లోసమ్ తో రకుల్ కి 16 ఏళ్ల అనుబంధం ఉందట. మా తో పాటు కలిసి పెరిగావు. నీవు లేవన్న బాధ జీర్ణించుకోవడం కష్టం. నిన్ను బాగా మిస్ అవుతానని, దూరమైన పెట్ డాగ్ ని ఉద్దేశిస్తూ రకుల్ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు.

బ్లోసమ్ తో దిగిన ఫోటోలు కూడా రకుల్ అభిమానులతో పంచుకున్నారు. రకుల్ తన ప్రియమైన పెట్ డాగ్ ని కోల్పోయారని తెలిసిన అభిమానులు ఓదారుస్తున్నారు. ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే..కెరియర్ మొదట్లో వరుస ఛాన్సులు కొట్టేసిన ఈ చిన్నది..ప్రస్తుతం ఛాన్సులేవి రాకపోవడంతో తన సొంత బిజినెస్ పనులతో బిజీ గా ఉంటుంది.

follow us