ఆహా లో సందడి చేసిన రకుల్ !

  • Written By: Last Updated:
ఆహా లో సందడి చేసిన రకుల్ !

“కెరటం” చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయిన రకుల్ అతి తక్కువ కాలంలోనే మంచి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్య బాలీవుడ్ కు వెళ్ళి అక్కడి సినిమాల్లో నటిస్తుంది. ఒక నటిగానే కాకుండా బిజినెస్ ఉమెన్ గా నేటి సమాజంతో పోటీ పడుతుంది. హైదరాబాద్ లో ఎఫ్45 పేరుతో రెండు జిమ్ లు ఓపెన్ చేసి కోట్లల్లో సంపాదిస్తుంది. జిమ్ కు సంబందించిన బ్రాంచ్ లను వైజాగ్, తదితర ప్రాంతాల్లో ఓపెన్ చేసింది. నటనతో పాటు తన తెలివితేటలతో బిజినెస్ లో కూడా రానిస్తుంది. నటి అంటేనే ఎఫ్ఫైర్స్, డేటింగ్స్, లివింగ్ రిలేషన్స్ ఇలా ఎన్నో గాసిప్స్ ఉంటాయి అలాగే రకుల్ పై కూడా ఎన్నో వదంతులు సోషల్ మీడియా ద్వారా మనకు వినపడుతూ ఉంటాయి. అలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి “ఆహా” డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ కి గెస్ట్ గా విచ్చేసింది.

అల్లు అరవింద్ నిర్మాణంలో ఆహా “సామ్ జామ్” అనే టాక్ షో నడుస్తున్న సంగతి తెలిసిందే. అక్కినేని సమంత హోస్ట్ గా సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ఇప్పటివరకు ఎంతో మంది స్టార్స్ వచ్చి ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఈ షో కి రకుల్ ప్రీత్ సింగ్ కూడా వచ్చేసింది. రకుల్ తో పాటుగా డైరక్టర్ క్రిష్ కూడా వచ్చారు. సమంతా హోస్ట్ గా రకుల్ ను కొన్ని ప్రశ్నలు అడిగింది. కాలేజీ రోజుల్లో స్కూటీ రైడ్ కి చార్జెస్ వసూలు చేసేది అంట అని అడగగా రకుల్ మీకు ఎవరు చెప్పారు అంటూ అలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ అంటే ఇష్టం అన్నది. బాలకృష్ణ సినిమాలోని ఓ డైలాగ్ చెప్పమంటే శ్రీమన్నారాయన చిత్రంలోని డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అంటూ నవ్వుతూ చెప్పింది. సోషల్ మీడియాలో వస్తున్న ఎఫ్ఫైర్స్ పై కూడా సమంత రకుల్ ని ప్రశ్నించగా.. పుకార్లు పుట్టించే వాళ్ళ మన గురుంచి ఆలోచించరు. వాళ్ళ గురుంచి మనం ఎందుకు ఆలోచించి టైమ్ వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు కూడా నాకు ఎవరో గిఫ్ట్ గా ఇచ్చారు అంటూ వార్తలు వచ్చాయి. అలా గిఫ్ట్ లు ఇచ్చే వాళ్ళు ఉంటే నేను ఎందుకు పని చెయ్యాలి అంటూ సీరియస్ అయ్యింది. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు గురించి నేను పట్టించుకొను అంది.

follow us