తండ్రికాబోతున్న మెగా పవర్ స్టార్

తండ్రికాబోతున్న మెగా పవర్ స్టార్

మొత్తానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలుపుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. శ్రీ ఆంజనేయస్వామి వారి ఆశీస్సులతో రామ్ చరణ్, ఉపాసనలు తల్లిదండ్రులు కాబోతున్నారని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చిరంజీవి చేసిన ఈ ట్వీట్ తో మెగా అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

రామ్ చరణ్‌, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా అందరూ ఒకే టైంలో పెళ్లి చేసుకున్నారు. అందరికీ పిల్లలున్నారు. వారంతా కూడా తమ తమ సంతానంతో సందడి చేస్తుంటే.. తమ హీరో రామ్ చరణ్‌ వారసుడి కోసం మెగా అభిమానులు మాత్రం తీవ్రంగా ఎదురుచూడసాగారు. పదే పదే తన మాతృత్వానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవ్వడంతో ఉపాసన కూడా అప్పుడప్పుడు అసహనం వ్యక్తం చేస్తూ వచ్చేది. ఇక ఇప్పుడు అధికారికంగా తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలుపడంతో అంత హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.

ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో #RC15 చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా.. దాదాపు షూటింగ్ కంప్లీట్ కావస్తోంది. ఇదిలా ఉంటే ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఇటీవలే మరో సినిమా అనౌన్స్ చేశాడు.

Tags

follow us