రామ్ చరణ్ కొత్త పార్టీ పేరు ‘అభ్యుదయం పార్టీ’

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడా..? ఇప్పటీకే తండ్రి ప్రజారాజ్యం, బాబాయ్ జనసేన పార్టీ లు పెట్టారుగా..చరణ్ కూడా కొత్త పార్టీ పెడుతున్నాడా..? అని అనుకుంటున్నారా..అదేమీ లేదండీ. తన కొత్త సినిమాలో చరణ్ రాజకీయ నేతగా కనిపించబోతున్నాడు. ఆలా ఆయన పార్టీ పేరు అభ్యుదయం పార్టీ.
వివరాల్లోకి వెళ్తే..ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న చరణ్..ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో డ్యూయల్ రోల్ లో చరణ్ కనిపించనున్నాడు. వాటిలో ఒక పాత్ర రాజకీయ నేత అని తెలుస్తుంది. రాజకీయ నేత పాత్ర అయితే ఇంకోటి ఎన్నికల అధికారి పాత్ర అని అంటున్నారు. ఈ సినిమాలో చరణ్ సీఎం కూడా అవుతారంటా. అయితే ఆయన పార్టీ పేరు అభ్యుదయం పార్టీ. గుర్తేమో ట్రాక్టర్ అంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారం కోసం నిర్వహించే బహిరంగ సభకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. అందుకు సంబంధించిన సెట్ ఫొటోలు కొన్ని నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ ఫొటోల్లో సభా ప్రాంగణం అంతా పసుపు తోరణాలతో ఉండటం.. బోర్డు కూడా ఎల్లో కలర్‌లో ఉండటం గమనార్హం. ఇదే కాకుండా.. కొన్ని ఫొటోల్లో చరణ్ సైకిల్ మీద కన్పిస్తున్నారు కూడా. ఇవన్నీ చూస్తుంటే.. సినిమాలో టీడీపీని రిప్రజెంట్ చేస్తూ.. ఆ పార్టీని ప్రమోట్ చేన్నారేమో..? అంటూ అంత మాట్లాడుకుంటున్నారు.