RC15 లో చరణ్ కోసం ఒక్కో ఇండస్ట్రీ నుండి ఒక్కో స్టార్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్టటికే శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్యూలో ఈ సినిమా షూటింగ్ ను జులైలో ప్రారంభిస్తామని దిల్ రాజు వెల్లడించారు. అయితే ఈ సినిమాపై తాజాగా ఫిల్మ్ నగర్ లో ఆసక్తికర వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. అందేంటంటే..ఈ ప్రతిష్టాత్మక ప్రాజక్టులో ఓ పవర్ ఫుల్ పాత్ర కోసం ఒక్కో ఇండస్ట్రీ నుండి ఒక్కో స్టార్ నటుడిని తీసుకోబోతున్నారట. అంతే కాకుండా ఈ పాత్ర నిడివి దాదాపు ముప్పై నిమిషాల పాటు ఉండబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక ఆ పాత్ర కోసం బాలీవుడ్ నుండి సల్మాన్ ఖాన్ ను, తమిళ పరిశ్రమ నుండి విజయ్ సేతుపతిని, కన్నడ నుండి కిచ్చా సుదీప్ లేదా ఉపేంద్ర అనుకుంటున్నారట. అంతే కాకుండా తెలుగులో అయితే ఆ పాత్ర కోసం మెగాస్టార్ మరియు పవన్ కల్యాణ్ ను అనుకుంటున్నారట. మరో వైపు తెలుగులో రామ్ చరణ్ డబుల్ రోల్ చేయబోతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై చరణ్ ఫ్యాన్స్ కు ఎన్నో అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను రీచ్ అవుతారా లేదా చూడాలి.