రఫ్ లుక్ లో రామ్..

రఫ్ లుక్ లో రామ్..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ రఫ్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తో మాస్ ఆడియన్స్ కు దగ్గరైన రామ్..ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్లాప్స్ గా మిగిలాయి. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ యాక్షన్ ఫిలిం కోసం రామ్ రఫ్ లుక్ లో కనిపించబోతున్నాడు.

తాజాగా రామ్ విజయవాడ సి.ఎం.ఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి రాగా అక్కడ తన రఫ్ లుక్ తో అదరగొట్టాడు. అఖండ తర్వాత బోయపాటి శ్రీను నుండి వస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ ఫై అందరిలో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. బోయపాటి శ్రీను కెరీర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారు. రామ్ తో నేషనల్ లెవల్ లో ఆడియన్స్ ని మెప్పించే కథని రాసుకున్నాడట. మరి ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

follow us