రామ్ పోతినేని ఇంట్లో విషాదం.. !

చిత్ర పరిశ్రమలో కరోనా మహమ్మారి కారణంగా కొద్ది రోజులుగా విషాద వార్తలే వినవలసి వస్తుంది. ఇప్పటికే పలువురు నటీనటులు, నిర్మాతలు, దర్శకులను మహమ్మారి పొట్టన పెట్టుకుంది. అంతే కాకుండా కొంతమంది సెలబ్రెటీల ఫ్యామిలీ మెంబర్స్ మరణించడంతో వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అయితే తాజాగా హీరో రామ్ పోతినేని నేని ఇంట్లోనూ విషాద చాయలు అలుముకున్నాయి. రామ్ తాతయ్య మృతి చెందిన విషయాన్ని హీరో సోషల్ మీడియా ద్వారా వెల్లడిండించారు. అయితే ఆయన కరోనాతో మరణించారా ఇతర ఆనారోగ్య కారణాల వల్ల మరణించారా అన్నది రామ్ వెల్లడించలేదు.
ఈ సందర్భంగా ఆమ్ ఎమోషనల్ పోస్ట్ ను పెట్టారు. విజయ వాడలో లారీ డ్రైవర్ గా జీవితాన్ని ప్రారంభించి కుటుంబం కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. మీరు ఎప్పుడూ రాజు లాంటి హృదయాన్ని కలిగి ఉన్నారు. గొప్పతనం అనేది జేబులో ఉన్న డబ్బుతో కాకుండా హృదయంలోని మంచి తనం ద్వారా కొలవాలని నేర్పించారు. మీ పిల్లల కలలను నెరవేర్చడానికి ఎంతో కష్టపడిన మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంటూ రామ్ పోస్ట్ లో పేర్కొన్నారు.