ప్రభాస్ సలార్ లో రమ్యకృష్ణ ..!

ఒకప్పుడు సినిమాల్లో పవర్ ఫుల్ హీరోయిన్ పాత్రలో నటించారలంటే రమ్య కృష్ణ కావాల్సిందే. ఇక ఇప్పుడు సినిమాల్లో పవర్ ఫుల్ లేడీ రోల్ ఏదైనా ఉందంటే దర్శకులు ముందుగా సంప్రదించేది కూడా రమ్యక్రిష్ణనే. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ ప్రభాస్ కు తల్లిగా అదరగొట్టింది. ఇక రాజ్యాన్నే గడగడలాడించే రాణిలా ప్రతి ఒక్కరినీ శాసించే మహరాణిలా ఆకట్టుకుంది. బాహుబలి చూసిన తరవాత ఆ పాత్రకు రమ్యకృష్ణ తప్ప ఎవరూ న్యాయం చేయలేరేమో అని అంతా అనుకున్నారు. ఈ సినిమా తరవాత రమ్యకృష్ణ కూడా పాన్ ఇండియా లెవల్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా టాక్ ప్రకారం మరో పాన్ ఇండియా ప్రాజెక్టులో రమ్యకృష్ణ నటించబోతున్నారట. ప్రస్తుతం ప్రభాస్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ పాత్రలో రమ్య కృష్ణ నటించబోతున్నారట. అంతే కాకుండా ఈ పాత్ర సినిమాను మలుపుతిప్పే విధంగా ఉండబోతుందట. అయితే ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే. ఇదిలా ఉండగా ప్రభాస్ కు జోడీగా సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా కు సంబందించిన ఫస్ట్ షెడ్యూల్ ను గోదావరి ఖని బొగ్గు గనుల్లో తెరకెక్కించారు. అంతే కాకుండా ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ వేశారు. అయితే మధ్యలో కరోనా మహమ్మారి రావడం తో సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. దాంతో మళ్లీ పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే షూటింగ్ ను ప్రారంభించనున్నారు.