రానా నైట్ ఔట్ !

రానా నైట్ ఔట్ !

రానా దగ్గుబాటి విభిన్నమైన సినిమాలను ఎంచుకుని మరి నటిస్తున్నాడు, విలన్ గా, హీరో గా ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన వేణు ఉడుగుల దర్శకత్వంలో “విరాటపర్వం” అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి రానాకు జోడీగా నటిస్తుంది. పోలిటికల్, థ్రిల్లర్ జోనర్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండనున్నాయి. మంచి కోసం పోరాడే ఓ చెడ్డవాడి కథ ఈ విరాటపర్వం. తెలంగాణలోని అప్పటి దళారి వ్యవస్థను ఈ చిత్రంలో వేణు చూపిస్తున్నాడు

కరోనా కారణంగ వాయిదా పడుతు వస్తున్న ఈ చిత్రం మరల షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రా నిర్మాత చెరుకూరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ. విరాటపర్వం ఓ షెడ్యూల్ మినహా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రాత్రి వెళ్లలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి సంబందించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను దర్శకుడు వేణు చిత్రీకరిస్తున్నాడు. రానా రాత్రి వేల జరిగే షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇప్పటివరకు రానా, సాయి పల్లవి నటించనటువంటి పాత్రలో కనిపిస్తారు. అని అన్నారు. హింది, తమిళ్ బాషల్లో విడుదల చెయ్యాలని చిత్రా బృందం భావిస్తుంది.

follow us