ఓటీటీ లో విరటపర్వం ..?

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో థియేటర్లు మూతపడ్డాయి. దాంతో సినిమాలు మళ్ళీ ఓటీటీ బాట పడుతున్నాయి. ఇప్పటికే అనసూయ నటించిన థాంక్యూ బ్రదర్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసారు. ఇప్పుడు అదే దారిలో మరిన్ని చిత్రాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వాటిలో రానా హీరోగా నటించిన విరటపర్వం సినిమా కూడా ఉన్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. విరటపర్వం మేకర్స్ ఇప్పటికే పలు ఓటీటీ సంస్థలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారట.
ఒక వేళ డీల్ సెట్ అయితే ఈ సినిమా ఓటీటీలో రావడం కాయమని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఇక విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాల్లో విరటపర్వం సినిమా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఇపప్టికే విడుదలైన ఈ సినిమా పాటలు మరియు టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఓటీటీ నుండి కూడా విరటపర్వం మేకర్స్ కు ఆశించిన ఫలితం వచ్చే అవకాశం కూడా ఉంది. మరి చివరికి ఈ సినిమా ఓటీటీ డీల్ అవుతుందా లేదంటే థియేటర్ లోకే వస్తుందా చూడాలి.