శంకర్ కు షాక్ ఇచ్చిన అపరిచితుడు నిర్మాత.!

ranveer singhs anniyan remake with shankar in trouble
ranveer singhs anniyan remake with shankar in trouble

దర్శకుడు శంకర్ బుధవారం బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో అపరిచితుడు సినిమా హిందీ రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ సినిమా నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ శంకర్ కు షాక్ ఇచ్చారు. అపరిచితుడు హిందీ రీమేక్ హక్కులు తనవని ఓ లెటర్ పంపించారు అంతే కాకుండా శంకర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా కథ కోసం తనకు సుజాత అనే రచయితకు పూర్తి హక్కుల పేమెంట్ ఇచ్చానని చెప్పారు. ఇప్పుడు తనకు తెలియకుండా ఎలా సినిమా అనౌన్స్ చేస్తారని రవిచంద్రన్ ఫైర్ అయ్యారు.

అంతే కాకుండా బాయ్స్ సినిమా ఫ్లాప్ తో కష్టాల్లో ఉన్న శంకర్ కు అపరిచితుడు సినిమా తీసే అవకాశం ఇచ్చానని అన్నారు. కానీ అది గుర్తు పెట్టుకోకుండా ఇప్పుడు తన కథ తోనే సినిమా ఎలా తిస్తారని ప్రశ్నించారు. శంకర్ దిగజరుతున్నారని…కొంచెం విలువలు పాటించాలని సూచించారు. వెంటనే సినిమాను ఆపాలని లేదంటే లీగల్ గా తేల్చుకుంటామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అపరిచితుడు సినిమాను తమిళ్ లో అన్నియాన్ పేరుతో తెరకెక్కించారు. అదే సినిమాను తెలుగులో అపరిచితుడు పేరుతో డబ్ చేసారు. అయితే ఇప్పుడు ఆ చిత్రాన్నే బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించారు.