లెఫ్టినెంట్ రామ్ యుద్దం లో రాశిఖన్నా !!

లెఫ్టినెంట్ రామ్ యుద్దం లో రాశిఖన్నా !!

మహానటి ఫేమ్ తో తెలుగు తెరకు పరిచయం అయిన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తన తదుపరి చిత్రంను నిన్ను కోరి, పడి పడి లేచే మనసు చిత్రా దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో “లెఫ్టినెంట్ రామ్ యుద్దంతో రాసిన ప్రేమ కథ” అనే చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రంలో పూజ హెగ్డే, రష్మిక మందన్నాహీరోయిన్లు గా నటిస్తున్నారు. కొన్ని అనివార్య కరణాలవలన రష్మిక ఈ చిత్రం నుండి తప్పుకుంటునట్లుగా తెలుస్తుంది.

రష్మిక మందన్నా స్థానంలో పలు తమిళ మలయాళ హీరోయిన్స్ పేర్లునూ దర్శక నిర్మాతలు పరిశీలించారు. కానీ ఇప్పుడు ఆమె స్థానంలో రాశిఖన్నా నూ హీరోయిన్ గా తీసుకున్నట్లుగా సినీ వర్గాలనుండి అందుతున్న సమాచారం. ఈ చిత్రాన్ని స్వప్నా దత్త్, ప్రియాంకా దత్త్ లు నిర్మిస్తున్నారు. వీరు గతంలో మహానటి చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం యొక్క కథాంశం వార్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ అని తెలుస్తుంది. తెలుగు తో పాటుగా మలయాళం, తమిళ్ లో ఈ చిత్రం విడుదల కానున్నది.

ఇద్దరు స్టార్ ముద్దుగుమ్మలతో దుల్కర్ రొమాన్స్

follow us