కన్నడ లో బ్యాన్ ఫై రష్మిక క్లారిటీ

కన్నడ లో బ్యాన్ ఫై రష్మిక క్లారిటీ

పుష్ప ఫేమ్ రష్మిక అంటే కన్నడ ప్రేక్షకులు మండిపడుతున్నారు. కన్నడ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచమై..ఇప్పుడు ఆ ఇండస్ట్రీ నిే పట్టించుకోకపోవడం..కనీసం ఆ ఇండస్ట్రీ పేరు కూడా ఎక్కడ చెప్పకపోవడం పట్ల అక్కడ ప్రేక్షకులే కాదు సినీ ప్రముఖులు సైతం మండిపడుతున్నారు. తాజాగా ఆమెను కన్నడ లో బ్యాన్ చేసినట్లు కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలపై రష్మిక క్లారిటీ ఇచ్చింది. తనను ఎవ్వరూ బ్యాన్ చేయలేదని.. వ్యక్తిగత విషయాలను కెమెరా ముందు పెట్టలేనంటూ చెప్పుకొచ్చింది.

‘కన్నడ ఇండస్ర్టీ నన్ను బ్యాన్ చేయలేదు. నేను నా మాతృ పరిశ్రమని వదిలేసి ఎక్కడికి వెళ్లిపోవడం లేదు. నా వ్యక్తిగత జీవితంలో ఏమి జరుగుతుందో అది నాకు మరియు నాతో సంబంధం ఉన్నవారికి బాగా తెలుసు. కాంతారావు విడుదల సమయంలో.. కొంతమంది నాపై అనవసరంగా అతిగా స్పందించారు.

దాన్ని నేను సీరియస్గా తీసుకోలేదు. ఆ సినిమా విజయం సాధించినందుకు టీమ్ అందరికీ అభినందనలు తెలుపుతూ ఓ సందేశం కూడా పంపించాను. ఆ సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపాను. నా అభిప్రాయాన్ని నిరూపించుకోవడానికి ఈ సందేశాలన్నింటినీ ప్రజలకు చూపించలేను. కన్నడ సినిమాలపై నాకు ఎప్పటికీ గౌరవం..కృతజ్ఞతా భావం ఉంటుంది. సరైన ఆఫర్ వస్తే కన్నడ సినిమాల్లో నటించేందుకు కూడా సిద్దంగానే ఉన్నాను. అక్కడ సినిమాలు చేయలేదని వ్యక్తిగత ఊహల్లోకి వెళ్లోద్దు’ అని కోరుకుంది.

Tags

follow us