వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రష్మిక..సౌత్ సినిమాల పరువు తీసింది

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రష్మిక..సౌత్ సినిమాల పరువు తీసింది

ఈ మధ్య రష్మిక వివాదాలకు కేరాఫ్ గా మారుతుంది. ఇప్పటికే కన్నడ సినీ వర్గాలు రష్మిక ఫై అగ్రం వ్యక్తం చేస్తుండగా..ఇప్పుడు సౌత్ మొత్తం కూడా రష్మిక ఫై చివాట్లు పెడుతున్నారు. గీత గోవిందం తో యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న రష్మిక..ఆ తర్వాత వరుస అగ్ర హీరోల పక్కన జోడి కట్టి అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి చేరింది. ఈ మధ్య పుష్ప చిత్రంలో శ్రీవల్లి గా డీ గ్లామర్ రోల్ లో అదిరిపోయే అందంతో అందర్నీ కట్టిపడేసింది. ఈ మూవీ పాన్ ఇండియా గా రిలీజ్ అవ్వడం , భారీ విజయం సాదించడంతో అమ్మడికి క్రేజ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం వారసుడు మూవీ తో సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే సెట్స్ ఫై పుష్ప 2 తో పాటు పలు సినిమాలు ఉన్నాయి.

ఈ క్రమంలో ఈమె చేసిన కామెంట్స్ సౌత్ ఆడియన్స్ లలో ఆగ్రహం తెప్పిస్తున్నాయి. బాలీవుడ్‌లో రష్మిక నటించిన మిషన్ మజ్ను మూవీ ఓటీటీలో జనవరిలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్, సౌత్ ఇండియా సినిమాల్లోని సాంగ్స్‌ మధ్య పోలికని తీసుకొచ్చింది. రొమాంటిక్ సాంగ్స్ తీయడంలో బాలీవుడ్ బెస్ట్ అని చెప్పుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ.. చిన్నప్పటి నుంచి ఆ సాంగ్స్ చూస్తూనే పెరిగినట్లు వెల్లడించింది. మరోవైపు దక్షిణాది సినిమాల్లో అన్నీ మసాలా పాటలే ఉంటాయని వెటకారంగా కామెంట్స్ చేసింది. సౌత్‌ సినిమాల్లో ఐటెం నంబర్స్, డ్యాన్స్ నంబర్సే ఎక్కువ అంటూ ఎద్దేవా చేసింది. ఈ వ్యాఖ్యల ఫై సౌత్ ఇండస్ట్రీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

follow us