చాలా దూరం వెళ్లి పోయావు..ర‌ష్మిక మాజీ ప్రియుడు వీడియో..!

rashmika ex boyfriend shares rashmikas first audition video
rashmika ex boyfriend shares rashmikas first audition video

క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న ప్ర‌స్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల ప‌క్క‌న ఛాన్స్ లు కొట్టేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇప్ప‌టికే ర‌ష్మిక మ‌హేశ్ బాబు లాంటి సూప‌ర్ స్టార్ ప‌క్క‌న న‌టించి అల‌రించింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కుతున్న పుష్ప సినిమాలోనూ న‌టిస్తోంది. అంతే కాకుండా త‌మిళ్ లోనూ ఈ అమ్మ‌డికి మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌ని గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే ర‌ష్మిక కన్న‌డ సినిమా కిరాక్ పార్టీతో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో ర‌ష్మిక‌కు వ‌రుస ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అయితే ఈ సినిమాలో న‌టించిన ర‌క్షిత్ శెట్టి అనే కన్న‌డ నటుడితో ర‌ష్మిక ప్రేమాయ‌ణం కూడా న‌డిపించింది. అంతే కాకుండా ఇద్ద‌రికీ నిశ్చితార్థం కూడా జ‌రిగింది. అయితే ఏవో కార‌ణాల వ‌ల్ల వీరి పెళ్లి మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. అప్ప‌టికే ర‌ష్మిక తెలుగులో ఫుల్ బిజీ అయ్యింది.

దాంతో సినిమా అవ‌కాశాలు పెర‌గ‌టంతోనే ర‌ష్మిక త‌న ప్రియుడికి దూరం అయ్యిందంటూ గుస‌గుస‌లు వినిపించాయి. ఇక విడిపోయాక ర‌ష్మిక‌, ర‌క్షిత్ ఎవ‌రి దారి వాళ్లు చూసుకున్నారు. ఇదిలా ఉండ‌గా ఈ రోజు క‌న్నడ బ్యూటీ పుట్టిన రోజును జ‌రుపుకుంటుంది. ఈ సంద‌ర్భంగా ర‌క్షిత్… ర‌ష్మిక కిరిక్ పార్టీ కోసం ఆడిష‌న్ ఇచ్చిన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. నువ్వు కిరిక్ పార్టీ సినిమా కోసం ఇచ్చిన అంద‌మైన వీడియోను షేర్ చేస్తున్నా. నీ కోరిక‌ల‌ను నెర‌వేర్చుకునేందుకు అప్ప‌టి నుండి ఇప్ప‌టివ‌ర‌కు నువ్వు చాలా దూరం వెళ్లిపోయావు. నీ గురించి గ‌ర్వంగా ఉంది. నువ్వు ఇంకా స‌క్సెస్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. అంటూ పోస్టో లో పేర్కొన్నాడు.