ఇద్దరు స్టార్ ముద్దుగుమ్మలతో దుల్కర్ రొమాన్స్

ఇద్దరు స్టార్ ముద్దుగుమ్మలతో దుల్కర్ రొమాన్స్

“మహానటి” సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన నటుడు దుల్కర్ సల్మాన్. ఆ తరువాత పలు మలయాళ సినిమాలు తెలుగులో డబ్బ్ అవ్వడంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన “లెఫ్టినెంట్ రామ్ యుద్దంతో రాసిన ప్రేమ కథ” అనే చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తాడు. గతంలో ఆయన “కృష్ణ గాడి వీర ప్రేమ గాద”, “పడి పడి లేచే మనసు” అనే చిత్రాలను తెరకెక్కించాడు. దుల్కర్ హీరోగా వస్తున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే, రష్మిక మందన కథానాయకిలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఈ స్టార్ హీరోయిన్స్ వారి డేట్స్ ను అడ్జస్ట్ చేసుకున్నట్లుగా సమాచారం.

దుల్కర్ సల్మాన్ తెలుగులో నటిస్తున్న రెండో చిత్రం ఇది. ఇకా ఈ చిత్రాన్ని “మహానటి” నిర్మాతలు స్వప్నా దత్, ప్రియాంకా దత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎప్పుడో షూటింగ్ ప్రారంభించాలిసింది కానీ కరోనా కారణంగ వాయిదా పడుతు వస్తుంది. దుల్కర్ కూడా కరోనా పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చిన తరువాతనే షూటింగ్ స్టార్ట్ చేద్దాం అని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు. హను రాఘవపూడి ప్రేమకథలను తెరకెక్కించడంలో తన మార్క్ చూపిస్తాడు. కావున దుల్కర్ సల్మాన్ తో ఆయన తీయబోయే సినిమా వార్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ అని తెలుస్తుంది. పూజ హెగ్డే, రష్మిక మందన ల మధ్య లవ్ సీన్స్ ఆకట్టుకుంటాయని సమాచారం. మలయాళం తో పాటుగా తెలుగు, తమిళ్ లో ఈ చిత్రం విడుదల కానున్నది.

follow us