చ‌ర‌ణ్ శంకర్ సినిమాకు ర‌ష్మిక గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందా..?

rashmika mandanna gives her nod to rc 15
rashmika mandanna gives her nod to rc 15

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ త‌ర‌వాత శంక‌ర్ తో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా జులైలో సెట్స్ మీద‌కు వెలుతుంద‌ని దిల్ రాజు ఇటీవ‌లే ఓ ఇంట‌ర్యూలో వెల్లండించారు. ఇక ఈ సినిమాలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న హీరోయిన్ గా ర‌ష్మిక మంద‌న న‌టిస్తోందంటూ కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ర‌ష్మిక ఈ సినిమాలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌.

సినిమా క‌థ బాగా న‌చ్చ‌డం…అంతే కాకుండా త‌న పాత్ర‌కు ఇంపార్టెన్స్ ఉండ‌టంతో క‌థ విన్న వెంట‌నే ఓకే చెప్పింద‌ట‌. అంతే కాకుండా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఇక‌రు రామ్ చ‌ర‌ణ్ అంతే కాకుండా ప్యాన్ ఇండియా సినిమా కావడం తో ఎవ‌రైనా ఓకే చెప్పాల్సిందే ఇక ఆ గోల్డెన్ చాన్స్ ను ర‌ష్మిక ద‌క్కించుకుంది. ఇదిలా ఉండ‌గా ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ ముఖ్యమంత్రి పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్టు గుసగుస‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ర‌ష్మిక జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టించ‌బోతుంద‌ని తెలుస్తోంది.