నేరుగా ఓటిటిలో విడుదల కాబోతున్న రష్మిక బాలీవుడ్ మూవీ

నేరుగా ఓటిటిలో విడుదల కాబోతున్న రష్మిక బాలీవుడ్ మూవీ

రష్మిక నటించిన బాలీవుడ్ మూవీ నేరుగా ఓటిటి లో విడుదల అవుతుంది. తెలుగు , తమిళ్ తో పాటు హిందీ లో అమ్మడు క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. హిందీ లో ఈమె ‘మిషన్ మజ్ను’ సినిమా ద్వారా అడుగుపెట్టింది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన రష్మిక నటించింది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తి అయ్యినప్పటికీ థియేటర్స్ లలో మాత్రం విడుదలకు నోచుకోవడం లేదు. ఇక ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జనవరి 20న నేరుగా ఓటీటీలో సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. 1970ల నాటి కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో రా ఏజెంట్ గా సిద్ధార్ కనిపించనున్నాడు. శాంతను బగ్చీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గరిమా మెహతా, అమర్ బుటాలా, రోనీ స్క్రూవాలా ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి థియేటర్స్ లలో కాకుండా ఓటిటి ని నమ్ముకోవడానికి కారణం ఏంటో..

follow us