బన్నీ సో స్వీట్..పుష్ప అలా ఉండబోతుంది : రష్మిక

  • Written By: Last Updated:
బన్నీ సో స్వీట్..పుష్ప అలా ఉండబోతుంది : రష్మిక

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా పుష్ప. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీమూవీమేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన టీజర్ కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వస్తోంది. టీజర్ తక్కువ కాలంలోనే 50 మిలియన్ వ్యూవ్స్ ను సొంతం చేసుకుంది. ఇక కరోనా కాలంలోనూ బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు.

అయితే తాజాగా సోషల్ మీడియా లైవ్ లోకి వచ్చిన రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పుష్ప సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ పైన ఉందని చెప్పింది. అల్లు అర్జున్, మైత్రీమూవీ మేకర్స్, సుకుమార్ కాంబినేషన్ అదుర్స్ అని చెప్పింది. అంతే కాకుండా అల్లు అర్జున్ గురించి మీ ఒపీనియన్ చెప్పాలని అడగ్గా…హీ ఈజ్ సో స్వీట్ హీ ఈజ్ సో క్యూట్ అంటూ రాగాలు తీసింది. ఇక ఇప్పటికే పుష్ప సినిమాపై ఎన్నో అంచనాలు ఉండగా తాజాగా రష్మిక చేసిన వ్యాఖ్యలతో అంచనాలు రెట్టింపయ్యాయి.

follow us