ర‌ష్మిక మందన్నా రాంగ్ స్టెప్ తీసుకుందా ?

  • Written By: Last Updated:
ర‌ష్మిక మందన్నా రాంగ్ స్టెప్ తీసుకుందా ?

కన్న‌డ భామ ర‌ష్మిక మంద‌న్నా టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. తెలుగులో స్టార్ హీరోల‌తో న‌టిస్తోన్న ఈ భామ ఇటీవ‌లే బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మ‌ల్హోత్రా సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇదిలా ఉంటే ర‌ష్మిక తెలుగులో టాప్ హీరోయిన్ గా స్టార్‌డ‌మ్ సంపాదించే త‌రుణంలో..ఇలా బాలీవుడ్ కు అడుగుపెట్టి రాంగ్‌స్టెప్ వేసిందా..? అంటూ ప‌లువురు ఫిల్మ్ క్రిటిక్స్ అభిప్రాయ‌ప‌డుతున్న‌ట్టు ఫిలింన‌గ‌ర్ లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది.

ప్ర‌స్తుతమున్న తెలుగు హీరోయిన్ల‌తో అనుష్క‌, స‌మంత బాలీవుడ్ వైపు చూడ‌క‌పోవ‌డంతోనే స్టార్ హీరోయిన్లుగా మంచి పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చుకున్నారు. కానీ పూజాహెగ్డే విషయంలో మాత్రం కొంత మిన‌హాయింపునివ్వాల్సిందే. ఎందుకంటే ఓ వైపు తెలుగు సినిమాలు చేస్తూనే, మ‌రోవైపు హిందీలో కూడా త‌న మార్కెట్ ను ప‌దిలంగా ఉంచుకుంది. తెలుగు, హిందీలో స్టార్‌డ‌మ్ ను మెయింటైన్ చేస్తూ వ‌స్తోంది. కానీ ఇలా అంద‌రికీ క‌లిసి రావాలంటే క‌ష్ట‌మైన పనే. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ తో క‌లిసి పుష్ప ప్రాజెక్టు మిన‌హా తెలుగులో పెద్ద సినిమాలేవి ర‌ష్మిక చేతుల్లో లేవు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో ర‌ష్మికకు హిందీవైపు అడుగులు వేసే ప్ర‌య‌త్నం చేయ‌డం క‌లిసొస్తుందా..? లేదా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. సౌత్ లో ర‌ష్మిక స్టార్ హీరోయిన్ స్థాయిలో సెటిల్ అయ్యే క్రమములో ఇలాంటి నిర్ణయం ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.

follow us