RRR ఫై తన అక్కసుని వెళ్లగక్కిన బాలీవుడ్ నటి

RRR ఫై తన అక్కసుని వెళ్లగక్కిన బాలీవుడ్ నటి

RRR మూవీ గురించి ఎంత చెప్పిన తక్కువే. బాహుబలి తో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి..ఆర్ఆర్ఆర్ తో మరోస్థాయి కి తీసుకెళ్లాడు. ఎన్నో అవార్డ్స్ , రివార్డ్స్ దక్కించుకున్న ఈ మూవీ..తాజాగా ఆస్కార్ నామినేషన్స్ కు సైతం వెళ్లబోతుంది. ఈ క్రమంలో బాలీవుడ్ సీనియర్ నటి ఆర్ఆర్ఆర్ ఫై తన అక్కసుని వెళ్లగక్కింది.

రీసెంట్ గా ఓ బుక్ లాంచ్ లో పాల్గొన్న రత్న పాథక్ షా ‘RRR’పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇదొక తిరోగమని సినిమా అని , ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో చాలా పాపులర్. కానీ అది తిరోగమన చిత్రం. మనం ముందుకు వెళ్లాల్సిన సమయంలో ఈ సినిమా వెనకు వెళుతోంది. ప్రజాస్వానికి తల్లి లాంటి భరతదేశంలో భాగమైనందుకు మనం ఏం చేస్తున్నామో గమనించాలి. ఫిల్మ్ మేకర్స్ తమ పనిని విమర్శనాత్మకంగా చూడనంత వరకు మనం ‘RRR’ లాంటి సినిమాలు చూడవలసి వుంటుంది.

కానీ మనం విమర్శలని తీసుకోం. మన అహం దెబ్బతింటుంది. ఈ వాతావరణాన్ని చాలా మంది పెద్దలే షృష్టించారు. దురదృష్టవశాత్తు మేము అనుసరిస్తున్నాం’ అంటూ ‘RRR’పై విమర్శలు చేసింది.

follow us