ఫైనల్ షెడ్యూల్ కోసం గోవా వెళ్ళిన క్రాక్ టీమ్

వరస ఫ్లాప్స్ తో దూసుకుపోతున్న మాస్ మహారాజ్ రవి తేజ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో “క్రాక్” అనే చిత్రంలో నటిస్తున్నాడు..ఈ చిత్రం చివరి షెడ్యూల్ మినహా మిగతా పార్ట్ మొత్తం పూర్తి అయ్యింది. కమల్ కూతురు శృతి హాసన్, రవి తేజ కు జోడీ గా నటిస్తుంది. ఫ్యామిలీ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఆర్జివి స్కూల్ నుండి వచ్చిన అప్సరా రాణి ‘భూమ్ బద్దల్’అనే ఐటెమ్ సాంగ్ లో నర్తించింది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
“క్రాక్” చివరి షెడ్యూల్ ను గోవా లో జరుపుకోవడానికి రవి తేజ టీమ్ బయలు దేరింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఫ్లయిట్ లో వెల్లుతున్న ఓ పిక్ ను కూడా షేర్ చేశాడు. ఓ రెండు మూడు వారాలపాటు అక్కడే షూటింగ్ జరుపుకుని రవి తేజ పై వచ్చే క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి భరిలో నిలవనున్నదని సమాచారం. రవి తేజ క్రాక్ తరువాత రమేశ్ వర్మ డైరక్షన్ లో ఖిలాడి ప్లే స్మార్ట్ అనే చిత్రంలో నటించనున్నాడు.