క్రాక్ భలేగా తగిలావే బంగారం సాంగ్
మాస్ మహారాజ రవితేజ తాజాగా నటిస్తున్న సినిమా “క్రాక్”. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో దూకనుంది. ఇదిలా ఉండగా “క్రాక్” నుండి మరో లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. “భలేగా తగిలావే బంగారం” అనే పాటను ఉదయం 10గంటలకు విడుదల చేసింది. ఇక ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ స్వరాలు సమకూర్చగా…భలేగా తగిలావే బంగారం పాటను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ పాడటం విశేషం. ఇక ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కాంబినేషన్లో వచ్చిన ఈ సాంగ్ సూపర్ గా ఉందనే చెప్పాలి. మాస్ మహరాజ్ ఎనర్జీకి తగ్గట్టుగా థమన్ ఈ పాటకు సంగీతాన్ని అందించారు.