కొత్త కారును కొన్న రవితేజ అసిస్టెంట్ శ్రీను..అంత మీ దయవల్ల అంటూ కాళ్లకు మొక్కాడు

కొత్త కారును కొన్న రవితేజ అసిస్టెంట్ శ్రీను..అంత మీ దయవల్ల అంటూ కాళ్లకు మొక్కాడు

మాస్ రాజా రవితేజ పర్సనల్ అసిస్టెంట్‌, మేనేజర్‌ శ్రీనివాస్ రాజు టాటా హారియర్ ఎస్‌యూవీ కారును కొనుగోలు చేసాడు. రవితేజ వద్ద ఎంతో కాలంగా పర్సనల్ అసిస్టెంట్‌గా, మేనేజర్‌గా శ్రీనివాస్ రాజు పనిచేస్తున్నారు. రవితేజ హీరోగా నటించిన అన్ని సినిమాల్లోనూ శ్రీనివాస్ రాజు ఏదొక చిన్న పాత్ర లో కనిపిస్తుంటాడు. అలాగే రవితేజ ఎక్కడికి వెళ్లినా పక్కనే శ్రీనివాస్ రాజు కనిపిస్తారు. అలాంటి శ్రీను తాజాగా టాటా హారియర్ ఎస్‌యూవీ కారును కొన్నాడు.

ఈ విషయాన్ని శ్రీను తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అలాగే, ట్వీట్‌లో ఒక వీడియోను కూడా పోస్ట్ చేసారు. ఈ వీడియోలో రవితేజ కూడా ఉన్నారు. తన కొత్త కారును రవితేజ వద్దకు తీసుకెళ్లిన శ్రీను.. ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. తన హీరోతోనే కారు నడిపించారు. ఈ ఆనందాన్ని, రవితేజపై తనకున్న భక్తిని ట్వీట్‌లో వెల్లడించారు శ్రీను.

‘‘నా గ్రామంలో సైకిల్ తొక్కుకునే దగ్గర నుంచి సొంతంగా కారు కొనుక్కునే స్థాయికి వచ్చాను. ఇదంతా మీ వల్లే సాధ్యపడింది. మీతో కలిసి నేను ఎన్నో మైళ్లు ప్రయాణించి ఉండొచ్చు.. కానీ, మీరు కారు నడుపుతుంటే కొన్ని కిలోమీటర్ల దూరం మీ పక్కనే కూర్చోవడం వాటిన్నింటికంటే గొప్ప. నా ప్రతి అడుగులో మీరు ఉన్నందుకు థాంక్యూ డియర్ మాస్ గాడ్. మీకెప్పటికీ రుణపడి ఉంటాను. నా జీవితం మీకు అంకితం’’ అని రవితేజను ఉద్దేశించి శ్రీను ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tags

follow us