‘వాల్తేరు వీరయ్య’ నుంచి రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల

‘వాల్తేరు వీరయ్య’ నుంచి రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల అయ్యింది. దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్, ఫస్ట్ సింగిల్ ఇలా అన్ని కూడా సినిమా ఫై అంచనాలు పెంచేయగా..తాజాగా విడుదలైన రవితేజ టీజర్ సినిమా ఫై మరింత ఆసక్తి పెంచింది.
మేక పిల్లను తీసుకుని రవితేజ విలన్స్ దగ్గరకు రావటం.. వారిని చితక బాదటం.. ఏం రా వారి సమజయిందా.. అంటూ మాస్ మహరాజా చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తున్నాయి. వాల్తేరు వీరయ్య లో విక్రమ్ సాగర్ ఏసీపీ పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు. రవితేజ తో గతంలో పవర్ వంటి పవర్ ఫుల్ సక్సెస్ ను ఇచ్చిన బాబీ మరోసారి రవితేజను అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాగే ఈ సినిమాలో కనిపించబోతున్నాడు అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాత.