ర‌వితేజ “ఖిలాడీ” విడుద‌ల వాయిదా..!

  • Written By: Last Updated:
ర‌వితేజ “ఖిలాడీ” విడుద‌ల వాయిదా..!

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న ఖిలాడీ సినిమాను వాయిదా వేస్తున్న‌ట్టు తాజాగా చిత్ర‌యూనిట్ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. మే 28న విడుద‌ల‌కావాల్సిన ఈ చిత్రాన్ని కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా వేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. కరోనా ఉధృతి త‌గ్గుముఖం ప‌ట్టిన త‌ర‌వాత‌ కొత్త రిలీజ్‌డేట్‌ను ప్ర‌క‌టించనున్నారు. ఇదిలా ఉండ‌గా క్రాక్ లాంటి మాస్ హిట్ త‌ర‌వాత ర‌వితేజ ఖిలాడి సినిమాను మొద‌లుపెట్టారు. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు షూటింగ్ పూర్తిం చేసుకున్న ఈ సినిమా షూటింగ్ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది.

హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి ప్లే స్మార్ట్ అనేది ట్యాగ్‌లైన్‌. అంతే కాకుండా ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. డా. జ‌యంతీలాల్ గ‌డ స‌మ‌‌ర్ప‌ణ‌లో ఏ స్టూడియోస్‌తో క‌లిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడుద‌లైన పోస్టర్లు మ‌రియు ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే క‌రోనా ఉదృతి కార‌ణంగా టాలీవుడ్ లో ఆచార్య‌, ల‌వ్ స్టోరీ స‌హా ప‌లు సినిమాలు విడుద‌ల తేదీని మార్చుకున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో మాస్ మ‌హారాజ్ కూడా చేరిపోయారు.

follow us